ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు .
ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు .తన అక్రమాల గురించి అన్యాయాల గురించి వార్తలు రాస్తారా అంటూ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరికి చెందిన సాక్షి పత్రికకు చెందిన జర్నలిస్టుపై దాడికి దిగారు .అంతే కాకుండా హత్య ప్రయత్నం కూడా చేశాడు దేవానంద్ .
దీంతో దేవానంద్ మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలతో ,నాయకులతో కల్సి పోరాటాలు చేశారు .దీంతో దిగొచ్చిన తఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి దేవానంద్ ను అరెస్ట్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.అయితే జర్నలిస్టు పై హత్యప్రయత్నాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ.. పోలీసు అధికారులతో సమగ్ర విచారణ చేయించిన అనంతరం నిందితుడు దేవానంద్‌ను అరెస్ట్ చేశారు.