Home / MOVIES / రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?-రివ్యూ

రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?-రివ్యూ

రివ్యూ: రాజా ది గ్రేట్‌
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: మాస్ మహారాజు రవితేజ, మెహ్రీన్‌, రాధిక, రాజేంద్రప్రసాద్‌, వివాన్‌, సంపత్‌ రాజ్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సన, హరితేజ, అన్నపూర్ణ .
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
నిర్మాత: శిరీష్‌
సమర్పణ: దిల్‌ రాజు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: అక్టోబర్‌ 18, 2017

ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాడు మాస్ మహారాజు రవితేజ. ఇండస్ట్రీ లో ఎనర్జీకి మారుపేరైన ఆయన సినిమా వ‌స్తోందంటే.. వినోదానికి ఢోకా ఉండదని, ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలుగు సినిమా ప్రేక్షకులు భావించేవారు .అంతే కాదు రవితో సినిమా తీసే నిర్మాతల్లో మినిమమ్‌ గ్యారెంటీ నమ్మకాన్ని తెచ్చిన ఈ ‘మాస్‌ మహారాజ్‌’ ఇటీవల గత కొద్ది కాలంగా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని మాత్రం అందుకోలేకపోవడమే కాకుండా నిర్మాతలను నష్టాల్లో ముంచాడు అని టాక్ .అయితే తాజాగా మాస్ మహారాజు ఆచితూచి అడుగేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. రెండేళ్ల తర్వాత రవితేజ నటించిన చిత్రం కావడం, పైగా ఇందులో అంధుడి పాత్రను పోషిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?మొట్ట మొదటిసారిగా పాత్రలో అంధుడిగా ఆయన నటన ఎలా ఉంది? వెండితెరపై పాత మాస్ మహారాజు మళ్లీ కనిపించాడా?
అసలు కథేంటంటే: నిజాయతీ కలిగిన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌రాజ్‌. ఆయనకి కుమార్తె లక్కీ మెహరీన్‌ . ఆ ఆఫీసర్‌కు కూతురంటే ప్రాణం. ఒక కేసు విషయంలో దేవ పాత్రలో నటించిన వివ‌న్‌ భటేనా తమ్ముడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు ఆ పోలీస్‌ ఆఫీసర్‌. తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో అతడిపైనా, అతని కుమార్తె లక్కీపైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. అప్పటినుంచి దేవ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది లక్కీ. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక‌) పోలీస్‌ ఆఫీసర్‌ చేయాలనుకుంటుంది. మరోపక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా ఏం చేశాడు? విలన్‌ గ్యాంగ్‌ నుంచి ఆమె ఎలా కాపాడాడు? అంధుడైన రాజా చివరికి ‘రాజా ది గ్రేట్‌’ అనిపించుకున్నాడా?

అసలు సినిమా ఎలా ఉందంటే:
ఒక హీరో.. హీరోయిన్‌ను కాపాడటం అనేది రొటీన్‌ స్టోరీ. అయితే ఆ హీరో అంధుడు కావడమే ఈ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా హీరో పాత్రను డిజైన్‌ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. అంధుడైన కథానాయకుడు ఒక బలమైన ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడనే దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చూపించాడు. డార్జిలింగ్‌ ఎపిసోడ్‌, కబడ్డీ ఆడే సన్నివేశాలు అలరిస్తాయి. యాక్షన్‌ సన్నివేశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రథమార్ధం చక్కని హాస్య సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఇక ద్వితీయార్ధాన్ని హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్నా యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే మూడు ఫైట్‌లను మూడు రకాలుగా డిజైన్‌ చేసుకున్నాడు. ఒక దశలో సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ పాటో, ఫైటో వస్తుంది. కొన్ని సన్నివేశాలు కేవలం నిడివి కోసం రాసుకున్నారేమో అనిపిస్తుంది. కాస్త సాగ‌దీత‌తో ఉన్నప్పటికీ అది వినోదాత్మకంగా చెప్పడంతో ప్రేక్షకుడు ఎక్కడా ఇబ్బందిపడడు. అయితే ద్వితీయార్ధాన్ని మరింత షార్ప్‌గా ఎడిట్‌ చేయాల్సింది. సినిమా మొత్తంలో హీరో-హీరోయిన్‌ల మధ్య ఎక్కడా లవ్‌ ట్రాక్‌ కనిపించదు. కానీ పాటలు వచ్చిపోతుంటాయి. వారి మధ్య కెమిస్ట్రీ చూపించలేదు. ‘గున్నాగున్నామామిడి…’ పాట ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది.

సినిమాలో ఎవరెలా చేశారంటే:

మాస్ మహారాజు ఇలాంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయడం ఇదే తొలిసారి. ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నందుకు ఆయనను అభినందించాలి. కళ్లు లేని పాత్ర అయినా, డబుల్‌ ఎనర్జీతో నటించాడు. రాజా పాత్రలో రవితేజను తప్ప ఎవర్నీ వూహించలేం. తన నుంచి సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అది ఇచ్చాడు. మెహరీన్‌కు ప్రాధాన్యం ఉన్నా, సినిమా అంతా ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌తో నడిపించింది. ప్రకాష్‌రాజ్‌ కనిపించింది కాసేపైనా బాగా నటించాడు.

ఇక ప్రతినాయకుడిగా వివాన్‌ తనదైన నటనతో మెప్పించాడు. దర్శకుడు కూడా ఆ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. అదే సమయంలో ఆ పాత్ర నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ రాబట్టాడు. రాజేంద్రప్రసాద్‌, సంపత్‌రాజ్‌, పోసాని ఇలా ప్రతి పాత్రకూ తెలిసున్న వారిని తీసుకోవడంతోనే దర్శకుడు సఫలమయ్యాడు. సంభాష‌ణ‌లు బాగున్నాయి. ర‌వితేజ‌తో క‌లిసి శ్రీ‌నివాస‌రెడ్డి త‌న‌దైన టైమింగ్‌తో న‌వ్వులు పంచారు. రాధిక పాత్ర గుర్తుండిపోతుంది. పతాక సన్నివేశాల్లో ఆమె పలికిన సంభాషణలు మాస్‌ను అలరిస్తాయి. సంపత్‌ రాజ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం కామెడీ అని సరిపెట్టుకోవడానికి లేదు. తనికెళ్ల భరణి పాత్ర బాగుంది. రాధిక, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, పోసాని తదితర ఆర్టిస్టులు తమ పాత్రల్లో మెప్పించారు. తెర వెనుక పని చేసిన వారిలో మోహనకృష్ణ పనితనం బాగుంది. డార్జిలింగ్‌ అందాలని ఆయన కెమెరాలో బాగా చూపించారు.సాయికార్తీక్‌ మరోసారి తన సంగీతంతో మెప్పించాడు. టైటిల్‌ సాంగ్‌ బాగుంది. గున్నాగున్నామామిడి బీట్‌ న‌చ్చుతుంది. నేపథ్య సంగీతం సూపర్ . నిర్మాణపరంగా దిల్‌ రాజు సినిమాల్లో ఎలాంటి లోటూ ఉండదు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. దర్శకుడు ఒక సాదాసీదా కథను తీసుకుని, హీరో పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసుకుని ప్రేక్షకులను మెప్పించాడు. కథానాయకుడు అంధుడు కావడంతో ఇది ఒక ఆర్ట్‌ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనిల్‌ రావిపూడి దీన్నో పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో విజయం సాధించాడు.

సినిమా బలాలు :

+ రవితేజ
+ వినోదం
+ నిర్మాణ విలువలు

సినిమా బలహీనతలు :

– రొటీన్‌ కథ
– ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ‘రాజా ది గ్రేట్‌’.. రవితేజ ది గ్రేట్‌

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat