తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా ఎదురు చూస్తున చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూవీ. ఎందుకు అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ తీస్తున్నారు. ఒకరేమో సంచలనాలకు మారు పేరు.. మరొకరు ఏమో విమర్శలకు మారు పేరు. మరి వారు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ. అయితే వారు ఒకే సమయంలో ఎన్టీయార్ బయోపిక్‌లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గురుశిష్యుల సినిమాలు తెలుగు పరిశ్రమలో సంచలనాలుగా మారాయి.
ఇక వర్మ పూర్తిగా కొత్తవాళ్లతో ఈ ప్రయత్నం చేస్తుంటే.. తేజ మాత్రం స్టార్ కాస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడట. తేజ తెరకెక్కించబోయే సినిమాలో ఎన్టీయార్‌గా బాలకృష్ణ.. బాలయ్య పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్‌లో తేజ మాత్రం వారి కుటుంబానికి చెందిన నటులందరినీ నటింపజేయాలని భావిస్తున్నాడట. అయితే మిగిలిన వాళ్ల ఒప్పుకోవడం పెద్ద కష్టం కాదు కానీ, జూనియర్ ఎన్టీయార్ ఏమంటాడోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై మాట్లాడడానికి ఎన్టీయార్‌ను తేజ కలవాలనుకుంటున్నట్టు సమాచారం.