ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉండటానికి పర్యటించిన సంగతి తెల్సిందే .
ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పలు పథకాలు ప్రకటించిన ఆయన ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం ఇస్తున్నసామాజిక పించన్ల వయసును తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు .
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల్లోని పేదలకు రెండు వేల రూపాయల పించన్ ఇస్తామన్నారు. ప్రస్తుత రోజుల్లో 45 నుంచి 50ఏళ్లకే అనారోగ్యం పాలవుతున్నారని .. అలాంటి వారికి తాము అధికారంలోకి రాగానే 45ఏళ్లకే పించన్ ఇస్తామని ఆయన అన్నారు .