ఏపీ లోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఇటివల ఆయన ఇసుక అక్రమాలను అడ్డుకుంటుంది అని నెపంతో మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షి మీద దాడి చేసిన సంగతి విదితమే .ఆ విషయంలో ఏకంగా అధికారిదే తప్పు అని తేల్చేసి ఆమె చేత క్షమాపణ చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .ప్రభాకర్ మరోసారి మహిళలపై దాడికి దిగారు .
అసలు విషయానికి వస్తే ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామమైన లింగారావు గూడెంలో ఆయన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు .అందులో భాగంగా కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ పార్టీ మాజీ నాయకుడు ,మాజీ సర్పంచ్ అయిన కోరపతి తిరుపతి స్వామి ఇంటివరకు చేరుకున్నారు .ఆ సమయంలో తిరుపతి భార్య మారతమ్మ ,ఆమె కుమారుడు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ..రోడ్లు కూడా పాడయ్యాయి .వాటిని నిర్మించాలని కోరారు .
గత మూడున్నర ఏండ్లుగా మీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వేడుకున్నారు .అంతే ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని వారింటి గోడపై కేవలం వైఎస్సార్ స్టిక్కర్ అంటించి ఉందని ఒకే ఒక్క కారణంతో ఆయన ఇంటి ముందు ఉన్న బట్టీ కొట్టును తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు .వెంటనే సంబంధిత అధికారులు తమ సిబ్బందితో బట్టి కొట్టును గునపాలతో పెకలించి అక్కడ నుండి ట్రాక్టర్ మీద పంచాయితీ కార్యాలయానికి తరలించారు .అంతే కాకుండా ఎమ్మెల్యే అనుచరులు మారతమ్మ ,ఆమె కుమారుడిపై దాడికి దిగారు .