యాంకర్ రవి గురించి అందరికి బాగా తెలుసు. ఒకప్పుడు మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్‌లలో యాంకర్‌గా ఉండి బాగా పాపులర్ అయ్యాడు రవి. ఆ తరువాత యాంకర్ శ్రీ ముఖితో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు.
అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో వీరిపై కామెంట్లు బాగా ఎక్కువయ్యాయి. అవేమిటంటే.. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతున్నారని యాంకర్లు రవి, శ్రీముఖిపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, శ్రీముఖి ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. రవిపై తన అభిప్రాయాన్ని తెలిపింది. రవి అంటే తనకు పిచ్చి అని, రవిని ఏ జంతువుతో పోలుస్తావు? అన్న ప్రశ్నకు.. రవికి “గొరిల్లా” నే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తుంటే తనకు కోతే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్రీముఖి.