తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఖాయం ..అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .తనపై వస్తోన్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “తానూ పార్టీ మారుతున్నాను అని వస్తున్నా వార్తలు నిజమే ..త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాను .ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తానూ రాహుల్ గాంధీ ను కలిశాను .చర్చలు జరిపా..త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని ఆయన తెల్చేశాను ..