దీపావళి పండుగ వచ్చింది అంటే ఇల్లంతా హడావుడిగా ఉంటుంది . ఒక వైపు పూజలు మరో వైపు ఇంటిని అలంకరించడం తో సరిపోతుంది . మారె పనికి సమయం కేటాయించలేనంత పని ఉంటుంది . మనం చేసే పనికి ఒత్తిడికి తోడు అలసటను మరచి .పండుగ వాతావరణాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి కొన్ని సూచనలు .
పిండి వంటకాలు ::
పండుగ పుట రోడ్ మీద ట్రాఫిక్ జాముల్లో .మార్కెట్లలో ఒళ్ళు వునం చేసుకునే బాధ నుంచి విముక్తి పొందే కొన్ని యాప్స్ వచ్చాయి. వీటి ద్వారా మనకు కావలసిన మరియు నచ్చిన వంటకాలను ఆర్డర్ ఇవ్వవచ్చు .’స్వైగ్గి’ లాంటి యాప్ లా ద్వారా ఇంట్లో కూర్చొనే దేశంలో ఏమూలో ఉన్న స్నేహితులు , బందువులకు కూడా దీపావళి గిఫ్ట్స్ &స్వీట్స్ పంపవచ్చు . లైవ్ ఆర్దరింగ్ ట్రాకింగ్ ఉండటం వాళ్ళ మన పార్సిల్ పోతుందనే భయం ఉండదు . అలాగే దేశం లో పేరు పొందిన షాపులకు ఆర్దారీచ్చి , నచ్చిన పిండి వంటకాలను తెప్పించుకోవచ్చు , పైగా ఇంత మొత్తంలో ఆర్డేరిస్తేనే డెలివరీ చేస్తామని నిబంధనలు లేకపోవడం వాల్ల కొంచెం ఆనందకరమైన విషయం ..
అలంకార దీపాలు ::
దీపావళి అంటేనే కాంతులు విరజిమ్మే చిచ్చుబుడ్లు ,అయితే ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలి . నీటి మీద తేలే యల్ ఇడి దీపాలు , సోలార్ లైట్లు వాడాలి . వీటిని భద్రంగా దాచి ప్రతి యాడది పండుగలో ఉపయోగించవచ్చు . ఇంటి అలంకరణ లో ఛార్జింగ్ తో పని చేసే ఎల్ఈడి బల్బ్ లనే వాడండి దీనివల్ల కరెంటు పొదుపు చేయవచ్చు పైగా కొద్దీ స్థలంలో ఇమిడి పోతాయి …
స్వచ్ఛమైన గాలి ::
దీపావళి టైములో టపాసులతో జరిగే వాయు కాలుష్యం బోలెడంత ! బయటకు వెళ్లాలంటే బాయపడే పరిస్థితి . అయితే గాలి నాణ్యతను కొలిచే పలు రకాల యాప్ లు ఇప్పుడు అందు బాటులో ఉన్నాయ్ . ఈ యాప్ లను డౌన్లోడ్ చేసుకోండి . ఒక్కసారి మీ ఫోను ఆన్ చేసి పరీక్షించిన తరువాత బయటకు వెళ్ళాలి ..