పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలోగల కంసాలబేతపూడిలో ఈ రోజు తెల్లవారు జామున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్ తుందర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాపార్క్‌కు వ్యతిరేకిస్తూ.. ఆక్వాపార్క్‌ను ఇక్కడ్నుంచి తరలించాలని అక్కడి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆక్వాపార్క్ బాధితుల దీక్షను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలకు పన్నుతోంది. అంతటితో ఆగక బాధితులపై దాడులు జరిపైనా ఆక్వాఫుడ్ పార్క్‌ను నిర్మించాలని చంద్రబాబు సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే కంసాలబేతపూడిలో ఆక్వాపార్క్ బాధితులు చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు అర్థరాత్రి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీక్షా శిబిరం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో.. అప్పటికే పురుగుల మందు డబ్బాలతో ఉన్న ఆక్వాబాధితులను చూసి పోలీసులు ఖంగుతున్నారు. తమ దీక్షలను భగ్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు.
దీంతో వెను తిరిగిన పోలీసులు మళ్లీ తెల్లవారు జామున దీక్షాశిబిరం వద్దకు వచ్చారు. ఆక్వా పార్క్‌ను తరలించాలని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతటితో ఆగక వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న బాధితులను ఆస్పత్రికి తరలించకుండా.. పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.