Home / CRIME / దారుణం.. స్కూల్లోనే ‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బాలిక అనగానే

దారుణం.. స్కూల్లోనే ‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బాలిక అనగానే

‘సార్‌ నాకు వాంతి వస్తోంది.. బయటికి వెళ్తాను సార్‌’ అని చెప్పి సోమవారం పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రియాంక(14) మంగళవారం మృతదేహమై కనిపించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దర్పల్లి గ్రామంలో జరిడింది. గొల్లగడ్డ కాలనీకి చెందిన అడవిగొల్ల మల్లేష్‌ – లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక మండల కేంద్రం లోని శ్రీవిద్యా విజ్ఞాన్‌ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో చురుకుగా ఉండే ప్రియాంక ను సాటి విద్యార్థులు సూటిపోటి మాటలతో వేధిస్తు న్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తమ్ముడితో కలిసి పాఠశాలకు వెళ్లిన ఆమె 9:20గంటల ప్రాంతంలో క్లాస్‌ టీచర్‌ అనుమతితో బయటికి వచ్చింది. అలా వచ్చిన ప్రియాంకను ఎంతకూ తరగతి గదికి రాలేదని ఎవరూ గుర్తించ లేకపోయారు. వాంతులు అవుతున్నాయని ఆమె చెప్పినప్పటికీ తోటి విద్యార్థుల సహకారం లేకుండా బయటికి పంపించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని గ్రామస్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

మోత్కుకుంటలో మృతదేహం
ప్రియాంక ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు సోమవారం మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక మంగళవారం సాయంత్రం గ్రామస్తులకు గ్రామ శివారు మోత్కుకుంటలో మృతదేహం కనిపించింది. పరిశీలించగా ప్రియాంకది అని తేలడంతో బంధువు లు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి బ్యాగ్‌ను పరిశీలించగా అందులో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ‘నా చావుకు కారణం తరగతి గదిలోని విద్యార్థులు కాబట్టి నా కోసం వెతక వద్దు, ఉంటాను…’ అని ఉండగా పోలీసులకు ఫిర్యా దు చేశారు. కాగా, చదువులో చురుకుగా ఉండే ప్రియాంకతో తోటి విద్యార్థుల నుంచి ఎప్పుడూ తగ వులు, వేధింపులు ఎదురవుతున్నాయని చెబుతున్నా రు. అయితే, ఇవన్నీ పాఠశాల యాజమాన్యం దృష్టికి వెళ్లలేదా, వెళ్లినా పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ పోలీసుల విచారణలో బయట పడుతాయని భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat