పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలోగల కంసాలబేతపూడిలో ఈ రోజు తెల్లవారు జామున నుంచి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్ తుందర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాపార్క్‌కు వ్యతిరేకిస్తూ.. ఆక్వాపార్క్‌ను ఇక్కడ్నుంచి తరలించాలని అక్కడి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆక్వా పార్క్‌ను తరలించాలని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, ఇప్పటి వరకు తమతోపాటు ఆమరణ దీక్షలో ఉన్న ఆనంద్‌కుమార్ అనేవ్యక్తి అదృశ్యమయ్యాడని, తమలో భయాందోళన కలిగించేందుకే పోలీసులు అరెస్టు చేసి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాపార్క్ బాధితుల ఆమరణ దీక్ష భగ్నం అనంతరం.. బాధితులను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వాపార్క్ బాధితుల వైద్యానికి నిరాకరిస్తున్నారు.
