రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృష్టి’. రామ్ అబ్బరాజు దర్శకుడు. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అది యాక్సిడెంట్ కాదు సర్ మర్డర్’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో వెన్నెల కిషోర్ యాక్షన్ నవ్వులు పంచుతోంది. టెన్షన్‌తో ఫిడ్జెట్‌ను తిప్పుతూ ఆయన రిలాక్స్ అవుతున్న దృశ్యాలు కితకితలు పెడుతున్నాయి. మరి నిజంగా అక్కడ జరిగింది యాక్సిడెంటా? లేదా మర్డరా? తెలియాలంటే సినిమా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ఎం స్క్వేర్ ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్ దీనిని నిర్మిస్తున్నారు. నరేష్ కుమారన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
