ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి .
మొత్తం దేశంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద ఈ సంస్థ సర్వే నిర్వహించింది .ఈ సర్వేలో మహారాష్ట్రానికి మొదటిస్థానం వచ్చింది .దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబాయి వలన ఈ రాష్ట్రానికి 19 .72 శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తెల్పింది .ఆ తర్వాత పదహారు శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో కర్నాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలు ఉన్నాయి.
కానీ ఏపీ కి ఈ సర్వేలో స్థానం లేకపోవడం గమనార్హం .అయితే దాదాపు పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ..తొమ్మిది యేండ్ల పాటు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్న బాబు పాలిస్తున్న రాష్ట్రం టాప్ టెన్ లో లేకపోవడం ఇక్కడ చాలా విచారకమైన విషయమే కాకుండా టీడీపీ సర్కారు ఎంతగా విఫలం అయిందో వివరించడానికి ఈ సర్వే దోహదపడుతుంది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి .