టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా నాన్ బాహుబలి లిస్ట్ లో మెగాస్టార్ రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 టాప్ లో ఉంది.
ఓవరాల్ గా 164 కోట్ల గ్రాస్ సాధించిన చిరంజీవి సినిమా
మొత్తం మీద మూడో స్థానంలో నాన్ బాహుబలి లిస్ట్ లో టాప్ ఉంది. అయితే ఎన్టీఆర్ జై లవ కుశ ఇప్పటి వరకు 162 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తుండటంతో బిజినెస్ ముగిసేనాటికి ఖైదీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ మెగా రికార్డ్ ను బీట్ చేశాడన్న వాదన కూడా వినిపిస్తోంది. అసలు లెక్క తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.