తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది .
అంతే కాకుండా పార్టీ మారిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఖాయం అని కూడా ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ పార్టీకి చెందిన మరో వికెట్ బౌల్డ్ కానున్నది .తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి త్వరలో గుడ్‌బై చెప్పబోతున్నారు. తెలంగాణలో రోజురోజుకు టీడీపీ ప్రభావం తగ్గిపోవడమే కాకుండా తమను పట్టించుకునేవారే లేకుండా పోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని వార్తలు వస్తోన్నాయి .
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిన కానీ పెద్ది మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు అని సమాచారం .దీంతో రానున్న ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగాలని పెద్ది ఆలోచిస్తున్నారు .దీనికి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .