ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే .
అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు పావులు కదుపుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు .ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి .
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ లో మకాం వేశారు .త్వరలోనే తెలంగాణ కు రాహుల్ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వస్తోన్నాయి .ఈ క్రమంలో ఆయన వచ్చే నెలలో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం ఖాయం అని ..ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వడం ఖాయం అంటున్నారు .చూడాలి మరి ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో ..?