మిస్టర్ పర్‌ఫెక్ట్ వివాదం రామ్ గోపాల్ వర్మ టీడీపీ బ్యాచ్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ టీడీపీ నాయకులందరికీ చమటలు పడుతున్నాయి. యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి ఇంకా టీడీపీ చేరని వాణి విశ్వనాథ్ దాకా చాలామంది వర్మ పై రెచ్చిపోయారు, వార్నింగ్ లు ఇచ్చారు. ఈ సినిమా తీస్తోంది వైసీపీ నేత డబ్బులతో అయినా తనకి నచ్చింది.., తాను నమ్మిందే తీస్తానని, ఆఖరికి లక్ష్మీ పార్వతిని కూడా కలవనని వర్మ స్పష్టం చేస్తున్నారు. బ్రదర్ అనిల్‌ని ఎందుకు కలిసారో తెలియదు. అయితే వర్మ ఎవర్ని కలిసినా కలవకపోయినా ఒక్కర్ని కలిస్తే మాత్రం చంద్రబాబు కూసాలు కదిలే నిజాలు తెలుస్తాయి.
లక్ష్మీ పార్వతి తన వెర్షన్ చెబుతుంది, చంద్రబాబు తన వెర్షన్ చెబుతారు. అసలేం జరిగిందో పూర్తిగా న్యూట్రల్‌గా చెప్పగలిగింది ఒక్క లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మాత్రమే. ఎందుకంటే ఎన్టీఆర్.. ఆగస్ట్ సంక్షోభం సమయంలో జేపీ, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నారు. ఒకరకంగా ఎన్టీఆర్ తరపున జేపీ రాయబారిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చాలామంది జేపీని కలిసి అప్పుడేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసారు. అయితే జేపీ మాత్రం గతం గతః.. నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదని చెప్పేవారు. ఈ ఘటన గురించి చెప్పేటప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, లక్ష్మీపార్వతి కూడా అప్పుడప్పుడు జేపీ ప్రస్తావన తీసుకొస్తారు. ఇప్పుడు వర్మ గనుక జేపీని కలిసి నిజంగా అప్పుడేం జరిగిందో కనుక్కోగలిగితే, నిజాలు బయటి వస్తాయి. ఈ కుట్ర ద్వారా అంతిమంగా ప్రయోజనం పొందింది చంద్రబాబు కాబట్టి, జేపీని వర్మ వెళ్ళి కలిస్తే జేపీ నిజాలు చెబుతాడో.. లేదో మరి.. ఒకవేళ జేపీ నోరు విప్పితే చంద్రాబాబు చేసిన కుతంత్రాలు బయటపడడం ఖాయమని.. సర్వత్రా చర్చించుకుంటున్నరు.