ఏపీలో అనంతపురం జిల్లాలో ధర్మవరం లో ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ ఈ రోజు ధర్మవరం పట్టణానికి వెళ్లిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు,రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.జనసందోహానికి అభివందనం చేస్తూ జగన్ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా దీక్షలో కూర్చున్న మహిళా చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు జై జగన్ ..జై సీఎం అంటూ నినాదాలతో పట్టణం అంతా మారుమ్రోగింది..
