ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది బాబు ప్రస్తుత పరిస్థితి .
ఈ రోజు బుట్టా రేణుక వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంపై టీడీపీ పార్టీ సీనియర్ నేత ,రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు .ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ “బుట్టా రేణుక పార్టీలో చేరడం వలన పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు .ఆమెకు అంతగా రాజకీయ అనుభవం లేదు .ఆమె ఈ రోజు పార్టీలో చేరిన కానీ క్యాడర్ మాత్రం అలాగే ఉంది .అంతమాత్రాన ఆమెను పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారో అర్ధం కావడంలేదు .
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఎంపీ సీటు కేటాయిస్తే తను ,తన సోదరుడు వేరే మార్గం చూసుకోవాల్సి వస్తుంది అని పరోక్షంగా రేణుక చేరికను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు .అయితే ఇటీవల ఇంటింటి టీడీపీ కార్యక్రమం సమీక్షా సందర్భంగా ప్రస్తుతం ఉన్న వారిలో డెబ్బై మంది దాకా సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే ఆ లిస్టులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేరుంది అని ..అందుకే కేఈ ఇలా మాట్లాడుతున్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే బుట్టా రేణుక చేరిక సమయంలో కేఈ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది .