ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు .
కానీ వైసీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకపోవడం ఇక్కడ గమనార్హం ..అయితే ఎంపీ బుట్టా రేణుక వైసీపీ నుండి టీడీపీలో చేరడానికి బాబు భారీ మొత్తంలో ముట్టజెప్పాడు అని వైసీపీ పార్టీకి చెందిన శ్రేణులు ఆరోపిస్తున్నారు .ఈ క్రమంలో ఆమె వైసీపీ పార్టీను వీడి టీడీపీలో చేరడానికి బాబు రెండు వందల కోట్ల రూపాయలు ..వెయ్యి కోట్ల ప్రత్యేక కాంట్రాక్టులు అప్పజెప్పారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .
ఎంపీ బుట్టా రేణుక వైసీపీ పార్టీను వీడి టీడీపీలో చేరే ముందు నారా చంద్రబాబు నాయుడుని కలిశారు అని ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .విజయవాడలో ఒక ప్రముఖ హోటల్ లో బాబు రేణుక తో భేటీ అయ్యి ఈ డీల్ కుదుర్చుకున్నారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ..