బీసీసీఐ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద ధనవంతమైన క్రికెట్ బోర్డు .అంతటి ఘనచరిత్ర ఉన్న బోర్డు కేవలం చిన్న చిన్న తప్పులను చేస్తూ అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటుంది .ఈ క్రమంలో ఈ రోజు మంగళవారం టీంఇండియా మాజీ కెప్టెన్ ,ప్రపంచ స్థాయి అగ్ర బౌలర్,టీంఇండియా మాజీ కోచ్ అయిన అనిల్‌కుంబ్లే పుట్టిన రోజు.
ఈసందర్భంగా బీసీసీఐ ట్విటర్ ద్వారా ఆయనకు .టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలర్ ఇప్పటికీ జంబోనే. కొన్నాళ్లు సారథిగా జట్టును నడిపించాడు .అంతే కాకుండా టీంఇండియా జట్టు కోచ్‌గా సేవలందించారు. వీటిని పట్టించుకోని బీసీసీఐ ‘టీమిండియా బౌలర్ అనిల్ కుంబ్లేకు శుభాకాంక్షలు’ అంటూ అతి సాధారణంగా ట్వీట్ చేసింది. దేశానికి పేరు, ప్రతిష్ఠలు సాధించిన కుంబ్లేకు ఇచ్చే గౌరవం ఇదేనా, ఆయనో సాధారణ బౌలరా అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
పొరపాటు గమనించిన బీసీసీఐ వెంటనే ఆ పోస్ట్ తొలగించింది. టీమిండియా కెప్టెన్, లెజెండ్ అంటూ మరో కొత్త ట్వీట్ చేసింది.మొత్తం 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన కుంబ్లేనే ఇప్పటికీ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుంబ్లే .