పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోగల జియాగూడ పూనమ్ లక్ష్మీ నర్సింహనగర్లోని గురుకుల్ ది స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది.
కాగా, జియాగూడ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(40) తన కూతురును గురుకుల్ ది స్కూల్లో తొమ్మిదో తరగతి చదివిస్తున్నాడు. మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడాన్ని గమనించిన తండ్రి ఎందుకని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రైవేట్‌గా మాట్లాడాలని వేధిస్తున్నారని బలిక తండ్రికి తెలిపింది. అంతేగాక పాఠశాల గదిలో అభ్యంతరకరంగా కూర్చోబెడుతున్నారని వివరించింది. దీంతో తండ్రి సోమవారం ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
