ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు రాజ్యసభ సభ్యుడు, ఎంపీ సీఎం రమేష్‌కు కేటాయించడం జరిగింది. హంద్రీనీవాలోని పది ప్యాకేజీల పనులు, అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రమేష్ సంస్థలకే అప్పగించారు సీఎం చంద్రబాబు. అంతేకాక, గాలేరు నగరి ఫేజ్ – 1లో రెండు ప్యాకేజీల విలువ రూ.40కోట్ల అంచనా వ్యయం ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు కాంట్రాక్టును అప్పగించగా.. ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. ఈ పనులకు సంబంధించి ప్రస్తుత అంచనా విలువ రూ.100 కోట్లకు పెరిగిందంటూ సీఎం రమేష్ ప్రభుత్వానికి మళ్లీ బిల్లు పెట్టడం గమనార్హం. సీఎం రమేష్ సంస్థకు కేటాయించిన రూ.120 కోట్ల వంశధార ప్రాజెక్టు పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. గుత్తి – తాడిపత్రి నేషనల్ హైవే పనులలతోపాటు గండికోట ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ పనులను కూడా చంద్రబాబు సర్కార్ సీఎం రమేష్‌కే కేటాయించడం గమనార్హం.
సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలు అంతటితో ఆగడం లేదు. 60సీ నిబంధన కింద టీడీపీ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టులను చేజిక్కించుకున్న వారిని బెదిరించి మరీ కాంట్రాక్టులను తన సంస్థకే వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు.
కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎం రమేష్ సంస్థలు పనులను పూర్తి చేస్తున్నాయా..? అంటే అదీ లేదు. సీఎం రమేష్ తీరుపై టీడీపీలోనూ తీవ్ర అసంతృప్తి ఉండటంతో ఇప్పటికైనా సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలపై దృష్టి సారించాలని టీడీపీ నేతలే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు పోవడం గమనార్హం.
ఏదేమైనా ఎంపీ సీఎం రమేష్ తీరు ‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’ అనే రీతిలో ఉందని టీడీపీ నేతలే అంటున్నారు.