జైహూ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌కి జోడీగా నటించి బాలీవుడ్‌కు పరిచయమైన డైసీ మరోసారి హాట్.. హాట్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. ఏదో ఒక సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తే తనపై ఐటెం గర్ల్ అని ముద్ర వేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించింది. కరీనా కపూర్, కత్రినా కైఫ్‌లా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే వారు ఐటెం సాంగ్‌లో కనిపించినా అతిథి పాత్రలో నటించారు అని గొప్పగా చెబుతారు. అదే తాను నటిస్తే ఐటెం సాంగ్ అంటున్నారని డైసీ తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనకంటూ ఓ గొప్ప స్థానం సంపాదించుకోవడమే తన గోల్ అని స్పష్టం చేసింది. ఇకపై తాను ఐటెం సాంగ్స్‌లో కనిపించనని. కేవలం అతిథి పాత్రల్లోనే నటిస్తానని పేర్కొంది.
