సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు…. లక్ష్మీ సోదరి కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌గా గుర్తించారు. (కారులో ఉన్న మృతదేహాలు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు వర్షిత్ ..రెండ్రోజుల క్రితమే వారు మిస్సైనట్లు ఇంటి యాజమాని రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారులో పాయిజన్ వాసన …
మరోవైపు సీపీ సందీప్ శాండిల్య… సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆత్మహత్యా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. కారులో పాయిజన్ వాసన వస్తోందని, పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ పేర్కొన్నారు. అలాగే కారులో పురుగుల మందు ఉన్న రెండు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు
Tags crime five mebers die poision police cp sangareddy