ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు కుమార్తె జైదీపికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తోటవారి వీథిలో ఇంట్లోనే రక్తపుమడుగులో ఆమె కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అందులో కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో జై దీపికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అతనిని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలియవచ్చింది. నందుల రాజుకు బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. రాత్రి 1-30 గంటలకు పనులు పూర్తి చేసుకుని కొడుకుతో సహా తండ్రి ఇంటికి వెళ్లేసరికి జై దీపిక తీవ్ర గాయాలతో ఉందని, హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళితే చనిపోయిందని డాక్టర్లు చెప్పారని జై దీపిక సోదరుడు చెప్పారు. ఈ హత్యకు సంభందించిన పూర్తి విషయాలు తెలియాల్సింది
