ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లైంగిక వేదింపులు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు తమను వాళ్ళు అప్పుడు లైంగికంగా వేదించారు ..వీళ్ళు ఇప్పుడు వేధించారు అని ఆ మీడియా ఈ మీడియా అని చూడకుండా మాట్లాడుతూనే ఉన్నారు .మరికొంతమంది అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత హార్వే వైన్‌స్టైన్ పలువుర్ని లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
దీనిలో భాగంగా హాలీవుడ్ హీరోయిన్ అలిస్సా మిలానో నిన్న రాత్రి ట్విటర్‌లో ‘మీటూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేధింపులకు గురైన మహిళలు తనకు ట్వీట్ చేయమని కోరారు. దీంతో ఈ ప్రచారం కాస్త బాగా వైరల్ అయ్యింది. ప్రపంచంలో మహిళలపై వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలపడానికి పలువురు బాధిత మహిళలు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన అభిప్రాయాన్ని పంచుకుంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి చేసిన ట్వీట్లను చూస్తుంటే చాలా విచారంగా ఉందన్నారు.
‘ఇది చాలా బాధాకర విషయం. నాకు తెలిసి ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటా. నాకు స్నేహితులు ఉన్నారు. నా స్నేహితులైన కొందరు మగవారిని వారి కంటే వయసులో పెద్దవారైన పురుషులు లైంగికంగా వేధించారు’ అని ఆమె సంచలన ట్వీట్ చేశారు. చిన్మయి స్పందనతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. దీంతో ప్రస్తుత సమాజంలో మహిళలే కాదు, పురుషులలో కూడా లైంగిక వేధింపులకు గురైన వారు ఉన్నారని చెప్పడంతో అమెపై ప్రశంసల వర్షం కురిపించారు .