ఇండియాలో ఈజీమనీకి కేరాఫ్ అడ్రస్ ఆలయాలేనన్న సత్యం మరోసారి రుజువైంది. అయితే, ఈ సత్యాన్ని ఓ రష్యన్ యువకుడు నిరూపించడం గమనార్హం. అప్పటికీ తనను రష్యాకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. తను మాత్రం భారతదేశంలోని ఆలయాలన్నింటిలో అడుక్కోవడమే టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. సెల్ఫీల మోజులో ఉన్న వారినీ అతను వదల్లేదు. వారినుంచీ అందినకాడికి దండుకుంటున్నాడీ రష్యన్ యువకుడు.
కాగా,
ీ ఈ నెల 9న కాంచీపురం పర్యటనకు వచ్చిన రష్యా యువకుడు కోవ్ తన ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు అయిపోయిన కోపంతో ఏటీఎం కార్డును చించేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డబ్బుల కోసం కాంచీపురంలోని ఆలయం మెట్ల వద్ద కూర్చొని కోవ్ భిక్షమెత్తుతున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కోవ్ కు కౌన్సిలింగ్ ఇచ్చి చెన్నైలోని రష్యన్ రాయబార కార్యాలయానికి పంపినా.. తిరిగి వచ్చి టీ.నగరలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద యాచిస్తున్నాడు. ఇదేందని మీడియా కోవ్ ను ప్రశ్నించగా.. ఇండియాకు వచ్చేటప్పుడు తన వద్ద రూ.4వేలు మాత్రమే ఉన్నాయని, కాని ఇప్పుడు భిక్షం రూపంలో తన వద్ద లక్షల్లో నగదు చేరిందని కోవ్ తెలపడంతో మీడియాతోపాటు.. స్థానికులు కూడా ఖంగుతిన్నారు.
