అందం పెరగాలంటే టాబ్లెట్లు వాడితే సరిపోతుందా..? మందు బిళ్లలు మింగితే ఎర్రగా బుర్రగా తయారువుతారా..? ఇలాంటి అబద్ధాలే చెప్పి ఓ యువకుడు ఓ మైనర్ బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఈ సరికొత్త మోసం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాలికను నమ్మించి దగా చేసి చివరికి మోహం చాటేసిన ఘటన సామర్లకోట మండలం మాధవపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన జుత్తుక శివకళ్యాణ‌్ అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె అతడి మాటలు నమ్మగానే అతనిలో మోస గుణం బయటపడింది. అందం పెరగాలంటే నేనిచ్చే టాబ్లెట్లు వాడాలని నమ్మించి మత్తు టాబ్లెట్లు ఇచ్చేవాడు. అవి తీసుకున్న ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేసేవాడు. ఏడాది కాలంగా ఈ అమానుషం సాగింది. కొంత కాలం కిందట బాలిక గర్భవతి అయితే విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి గర్భస్రావం చేయించాడు.
కొద్ది రోజులుగా సాగుతున్న ఈ మోసాన్ని ఇటీవల బాలిక తల్లి కంట పడింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికపై అత్యాచారం చేస్తున్న శివకళ్యాణ‌్‌ను ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. శివకళ్యాణ‌్‌ను నిలదీసే సరికి దాడి చేసి పారిపోయాడు. బాలిక తల్లి రెండు వేళ్లు విరగ్గొట్టి ఉడాయించాడు. పైగా జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఖాకీల అడదండలతో నిందితుడు దర్జాగా తీరుగుతున్నాడు. దీంతో బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మైనర్ బాలికను మోసం చేసిన శివకళ్యాణ‌్‌కు పోలీసుల అండదండలున్నాయని మహిళా సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా కేసును నీరుగారుస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.