తాలిబన్ల ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాలిబన్ల ఆగడాలు దారుణంగా మారాయి. ముఖ్యంగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల ఆటవిక రాజ్యం ఇష్టానుసారంగా కొనసాగుతోంది.
అయితే, తాజాగా ఉగ్రవాదుల ఆకృత్యాలకు అద్దంపట్టే ఘటన మరొకటి జరిగింది. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా – అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో ఈ ఉదంతం వెలుగోలకి వచ్చింది.
తాలిబన్ల నుంచి విడుదల అనంతరం జాషువా, అతని భార్య కైట్లన్ కోల్మన్తోపాటు ముగ్గురు పిల్లలు టొరంటో చేరుకున్నారు. ఉగ్రవాదులు పెట్టిన చిత్రహింసలను జాషువా మీడియాకు తెలిపారు. ‘2014లో నా భార్యపై హక్కానీ ఉగ్రవాదులు అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కిరాతకంగా నా బిడ్డను హత్య చేశారు’ అని జాషువా చెప్పారు. ఓ గార్డుతోపాటు హక్కానీ కమాండర్ అబూ హజర్ తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.
Related Articles
జమ్మికుంటలో కలకలం
January 27, 2023