నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రైతుల ఆవేదన, ప్రజలాక్రందన పట్టించుకునే తీరిక చంద్రబాబుకు లేక పోవడంపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు భారీ వర్షాలతో నష్టాల్లో మునిగిపోతుంటే..మీరు, మీ ప్రభుత్వం కుంభకర్ణుడి పెద్దన్నలా నిద్రపోతున్నారని,
రైతు గుండెకోత, తల్లిదండ్రుల కడుపుకోత మిమ్మల్ని కదిలించడం లేదా..? అని జగన్ ప్రశ్నించారు. కాస్త మారండి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి.. పట్టించుకోండి అంటూ జగన్ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నీరో పాలనకన్నా..నారాపాలన ఘోరంగా ఉందని ఎందుకంటున్నారో ఇప్పటికైనా కాస్త ఆలోచించాలని, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో మీ పాత్ర ఉందని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సున్నా వడ్డీ, పావలావడ్డీ పథకాలన భూమిలో పాతేశారు. రైతులకు రుణాలు ఇవ్వొద్దని ఎస్ఎల్బీసీ మీటింగ్లో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పారన్నారు.