మెగా కుటుంబానికి చెందిన యువహీరో సుప్రీమ్ స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ నేడు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ నటిస్తోన్న లేటెస్ట్ కొత్త చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.
‘జవాన్’ చిత్రం తర్వాత సాయిధరమ్.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
సాయిధరమ్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం తొలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మెగా హీరో కుర్చీలో కూర్చొని, చేతిలో గన్ పెట్టుకుని డాన్‌లా కనిపించారు.