ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో నటించగా ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “జై లవకుశ “మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది నివేదా థామస్ .అయితే ఈ రోజు ఈ అమ్మడు పుట్టిన రోజు అని అభిమానులు ఉదయం నుండి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు .
ఈ విషయం మీద ఈ ముద్దుగుమ్మ క్లారీటీ ఇచ్చింది .ఈ విషయం గురించి తన సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “మీరు అందరూ అనుకున్నట్లు ‘ఈ రోజు నా పుట్టినరోజు కాదు. నా కోసం సమయం కేటాయించి శుభాకాంక్షలు చెబుతున్న వారికి ధన్యవాదాలు. టేక్ కేర్.’ అని నివేదా ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే గూగుల్‌లో మాత్రం ఈ అమ్మడు పుట్టినరోజు తేదీ మాత్రం అక్టోబర్ 15 అనే చూపిస్తోంది. కానీ నివేదా మాత్రం నేడు తన పుట్టినరోజు కాదంటున్నారు. మరి తన పుట్టిన రోజు ఎప్పుడో నివేదానే చెప్పాలి.