తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం వరంగల్ లోని నిట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీరామారావు పాల్గొన్నారు .మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు .
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు బాగున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలోనే దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది అన్నారు .యువనేత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది .
ఆధునిక యుగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేత రంగాన్ని అభివృద్ధి చేస్తూ టాస్క్ లాంటివి ఏర్పాటు చేసి విద్యార్ధుల్లో యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతున్న తీరును దేశాన్నే కాదు ప్రపంచాన్నే తెలంగాణ వైపు చూసే విధంగా మంత్రి కేటీఆర్ పని చేస్తోన్నారు .కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ ..అయన కెప్టెన్సీ లో ఖచ్చితంగా తెలంగాణ అనుకున్న అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అని అన్నారు .విద్యార్ధులు కోహ్లీ ,ధోని ఆ ఎదగాలంటే మంత్రి కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన యువతకు సూచించారు .