సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం తమ మనోభావాలను దెబ్బతీసిందని, తమ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్నికించపరిచిందని ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు..ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు..కానీ న్యాయస్థానం మాత్రం ఆ పుస్తకాన్ని నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని కాబట్టి మేము ఆ పుస్తకాన్ని నిషేధించలేమని తీర్పు ఇచ్చింది..అయినా ఆర్యవైశ్యులు పట్టువిడువకుండా కంచె ఐలయ్యపై పోరాటం చేస్తున్నారు..అయితే ఇప్పుడు ఆర్యవైశ్యులు అర్జెంట్‌గా పోరాడాల్సింది కంచె ఐలయ్యపై కాదు చంద్రబాబుపై. కంచె ఐలయ్య కంటే దారుణంగా చంద్రబాబు ఆర్య వైశ్య సామాజిక వర్గ వినాశానికి కుట్రలు పన్నుతున్నాడు..పట్టణాల్లో ఎన్ని మాల్స్ ఉన్నా..గల్లీ గల్లీలో ఆర్యవైశ్యులు కిరాణా దుకాణాలు పెట్టుకుని తమ జీవనం సాగిస్తూనే ఉన్నారు..ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలో బలంగా ఉన్నారు..ఏ మారు మూల గ్రామాంలో అయినా ఆర్యవైశ్యులు కిరాణా నుంచి అన్ని వ్యాపార సంబంధిత రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు..తాజాగా ఆర్యవైశ్యుల పొట్టపై చంద్రబాబు దెబ్బ కొట్టబోతున్నాడు. తన హెరిటేజ్ భాగస్వామి సంస్థ అయిన ఫ్యూచర్ గ్రూపు, అలాగే తనకు అత్యంత సన్నిహితమైన రిలయన్స్ సంస్థలతో కల్సి గ్రామీణ స్థాయిలో విలేజ్ మాల్స్ ప్రవేశపెట్టబోతున్నాడు.అంతే కాదు ఏపీలోని అన్ని రేషన్ దుకాణాలకు ఈ రెండు సంస్థలే సరుకులు పంపిణీ చేస్తాయి.దీంతో రేషన్ దుకాణదారులు చచ్చినట్లు ఆ సరుకులను కొనాల్సిందే..ఇక గ్రామాల్లో విలేజ్ మాల్స్‌లో ముందు అతి తక్కువ ధరకే సరుకులు అమ్ముతారు..దీంతో ప్రజలు షావుకార్ల కిరాణ దుకాణాలకు వెళ్లడం మానేసి ఈ విలేజ్ మాల్స్ వెంట పరిగెడతారు..ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు కిరాణా దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తుండడంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వ్యాపార రంగంపై ఆర్యవైశ్యుల ఆధిపత్యం బీటలు వారుతుంది. ఈ దశలో చంద్రబాబు విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయడం ఆర్యవైశ్యులకు ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వం విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయడం ముమ్మాటికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆక్రమించేందుకు జరుగుతున్న కుట్ర అని టీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ ఒక టీవీ చర్చలో అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన కార్పొరేట్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఆర్యవైశ్యుల పాలిట యమపాశంగా మారబోతుంది. గ్రామాల్లో విలేజ్ మాల్స్ ఏర్పాటు అయితే కిరాణాషాపులపై ఆధారపడి బతుకుతున్న ఆర్యవైశ్యుల బతుకులు రోడ్లున పడాల్సిందే. ఇప్సడు సామాజిక ఆత్మగౌరవం కోసం కంచె ఐలయ్యపై పోరాటం మానేసి ఆర్యవైశ్యులు ఆర్థిక మూలాలపై, తమ బతుకుదెరువుపై దెబ్బ కొట్టబోతున్న చంద్రబాబుపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఆర్యవైశ్యులారా కంచె ఐలయ్య కంటే చంద్రబాబు వెరీ డేంజర్.. జాగో..చంద్రబాబుపై పోరాటానికి సిద్ధం కండి..లేకుంటే భవిష్యత్తులో ఆర్యవైశ్యులు అనే సామాజికవర్గం కనుమరుగు అవడం ఖాయం..
