చంద్రబాబు సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా నెల్లూరు జిల్లాలో!. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంటికొక జాబు ఇస్తానంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి ప్రాణాలపాలిట యమపాశమయ్యారు. మరోవైపు నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం.
కాగా,
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తన సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను అమలు చేయలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రైతులు వారి వాగ్ధాటి చూపించారు. కాగా, నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో ఈ ఉదంతం జరిగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ జరగని రైతుల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడంతో ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. తమకు అర్హత ఉన్నా.. ఇంకా రుణమాఫీ జరగలేదంటూ మంత్రి సోమిరెడ్డిని నిలదీశారు. ఒక్కసారిగా రైతులంతా రుణమాఫీపై ప్రశ్నించడంతో మంత్రి ఖంగుతిన్నారు. రైతులు రుణమాఫీపై సూటిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియని మంత్రి సంబంధంలేని జవాబులు చెప్పి అక్కడ్నుంచి తప్పించుకున్నారు. మంత్రి సోమిరెడ్డి కలెక్టరేట్ నుంచి చల్లగా జారుకోవడంతో
మోసగాళ్లందు.. చంద్రబాబు మోసాలు వేరయా! అంటూ రైతులు అక్కడ్నుంచి వెనుదిరిగారు.
ఆకాశం నక్షత్రాలను పండించినట్లే. రైతులు నేలమీద గంజిల్నిపండించగలడు. భూమి పుత్రులు సఫలమయ్యేది భూమి ఒడిలో అయినా కబళించే ఇలాంటి నాయకుల విద్రోహ చర్యల వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.