రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు.
పై వాఖ్యాలకు అద్దం పడుతూ అనంతపురం జిల్లా కదిరిలో మరో ఘటన చోటుచేసుకుంది. కదిరిలో టీడీపీ నేత దేవానంద్ నడిబజారులో కత్తితో వీరంగం చేశాడు. అది కూడా ఓ విలేఖరిపై దేవానంద్ దాడి చేయడం గమనార్హం. అదే సమయంలో పక్కనే స్థానికులు కూడా ఉండటంతో ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో స్థానికుల సాయంతో దేవానంద్ నుంచి విలేఖరు అక్కడ్నుంచి తప్పించోగలిగాడు.
అనంతరం టీడీపీ నేత దేవానంద్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. అంతేకాదు.. అధికార పార్టీ నాయకుడే కదా! అని వదిలేయకుండా తన ఫిర్యాదుపై వెంటనే స్పందించి.. తనపై దాడి చేసిన టీడీపీ నేతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు బాధితుడు.