రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు.
పై వాఖ్యాలకు అద్దం పడుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో మరో ఘటన చోటుచేసుకుంది. కనిగిరిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నేతలు మున్సిపల్ కార్మికులపై ప్రతాపం చూపించారు. వారితోనే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ చేయించారు. ఇదేమిటని ప్రశ్నించిన కార్మికులను సైతం.. అధికారం మాది.. చెప్పింది చెయ్ అన్న రీతిలో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మాటలను విన్న స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.