బాలీవుడ్ ‘దబాంగ్ ఖాన్’ సల్మాన్..కుక్కలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సల్లూ భాయ్ సెలబ్రిటీ రియాల్టీషో ‘బిగ్‌బాస్’ 11వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో నేపథ్యంలో భాగంగా సల్మాన్ ఓ కంటెస్టెంట్‌ను తిడుతూ అతన్ని కుక్కలతో పోల్చారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణ చెప్పింది కంటెస్టెంట్‌కి కాదు కుక్కలకి. అనవసరంగా అతన్ని కుక్కలతో పోల్చివాటి విలువను తగ్గించానని చమత్కరించారు. అయితే భాయ్ ఎవ్వర్ని ఇంతలా తిట్టాడో మాత్రం చెప్పలేదు.
గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ జుబైర్ ఖాన్‌ను సల్మాన్ పంపించేశారు. ఇతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అల్లుడని బాలీవుడ్ వర్గాల సమాచారం. సల్మాన్ జుబైర్‌ని బిగ్‌బాస్ నుంచి గెంటేయడంతో సల్మాన్‌పై కేసు పెడతానంటూ మీడియా ముందు హల్చల్ చేశాడు.
