తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదని.. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ నెల 24వ తేదీన వరంగల్ అభివృద్ధిపై మరోసారి హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.