రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్ తిరుమల మరోసారి రామ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికల నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ మొత్తం ఒక డైలాగ్ గా సాగింది. ఇంతకీ ఆ డైలాగ్ వెర్షన్ ఏమిటంటే..!
అనుపమ : నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి..?
రామ్ : వాళ్లంతా తాగేసి, నేను తాగకుండా వాళ్ల టార్చర్ నేను భరించడం.
అనుపమ : మరి నచ్చింది..?
రామ్ : నేను మాత్రమే తాగేసి, వాళ్లెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్లు భరించడం.
అనుపమ : ఫ్రెండ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా ఏంటి..?
రామ్ : మన గతంలో జరిగిన కథలను చెబితే వినేవాడు ఫ్రెండ్. కానీ, ప్రతీ కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్
అనుపమ : మరి బెస్ట్ ఫ్రెండ్‌కి లవర్‌కి..?
రామ్ : మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్. మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిస్తే లవర్
అనుపమ : నిన్ను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గరి నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి..?
రామ్ : ఏడవటం
అనుపమ : మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా..?
రామ్ : మనకింకా ఆ అదృష్టం కలగలేదు.
అనుపమ : డోంట్ వర్రీ తొందర్లోనే ఏడుస్తావ్ ..!
# ఇందడీ ఉన్నది ఒకటే జిందగీ ట్రైలర్ రివ్యూ.. మీరూ ఓ లుక్ వేయండి..!