వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు.
ఇటీవల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ చూపించిన ఫోటోల విషయంలో రోజా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. రోజాకు గుండుకొట్టినట్టు ఉన్న ఫోటోను చూపించిన మురళీకృష్ణ. ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందని ప్రశ్నించాడు. దీంతో వెంటనే తీవ్రఆగ్రహానికి గురైన రోజా ఎంతో ఆవేశంగా స్పందించారు.
వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొట్టాలని ఉందని రోజా అన్నారు. ఈ ఫోటోలు కేవలం తనకు మాత్రమే పెట్టలేదని, ఇలాంటి ఫోటోలు చాలా మంది వైసీపీ నేతల ఫోటోలకు పెట్టాడని మండిపడ్డారు. ఏం తాము తలచుకుంటే టీడీపీ నేతల పెళ్లాలకు గుండ్లు కొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేమా.. అని ఆమె నిలదీశారు. వాడెవడో ఒక అబ్బాఅమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా.. వాడిని ఏం చెయ్యాలి అని ఆమె ప్రశ్నించారు. అలాగే ఇంతక ముందు న్యూడ్‌గా కూడా తన ఫోటోలను ఆన్ లైన్‌లో పెట్టారని రోజా మండిపడింది.