Home / ANDHRAPRADESH / బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్‌ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్‌ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత పెరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అతి చేయ‌గా.. ఎమ్మెల్యే అనిత వ‌చ్చి నీతులు చెప్పి.. వ‌ర్మ‌తో మొట్టికాయ‌లు వేయించుకుంది. ఇక తాజాగా టీడీపీ కొత్త క‌రివేపాకు అయిన వాణీ విశ్వ‌నాథ్ వ‌ర్మ‌ని ట‌చ్ చేసింది.. దీతో రాము ఊరుకుంటాడా.. అంతే స్వీట్‌గా రియ‌క్ష‌న్ ఇచ్చాడు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర్మ వ‌ర్సెస్ టీడీపీ దంగ‌ల్.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రో సంచ‌ల‌న వార్త టీడీపీ బ్యాచ్‌ను కుదిపేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను రాము కలవడంతో తెలుగు సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో రేగుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన నాటి నుంచి వర్మ వివాదానికి కారణం కాగా, ఆ సినిమాకి నిర్మాతగా వైసీపీ నేత అంటూ ప్రకటించి మండుతున్న మంటల్లో నూనె పోశారు. అంతే కాకుండా ఆపార్టీ మ‌హిలా ఎమ్మెల్యే ఫైర్ బ్రాడ్‌ రోజా కూడా నటిస్తారని ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ క్రమంలో వివాదాన్ని మరింత రాజేస్తూ బ్రదర్ అనిల్ కుమార్‌ను హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో కలవడం కలకలం రేపింది. ప్ర‌స్తుతం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం జ‌రుగుతున్న టైంలో వ‌ర్మ అనిల్ బ్ర‌ద‌ర్‌ని క‌ల‌వ‌డంతో.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో మండుతోంద‌ని.. స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat