Home / MOVIES / స్పైడ‌ర్ ప్లాప్‌తో.. మ‌హేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

స్పైడ‌ర్ ప్లాప్‌తో.. మ‌హేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

సినీ ఇండ‌స్ట్రీ జూదం లాంటిది. కొంత మంది రాత్రికి రాత్రే.. స్టార్లుగా, కోటీశ్వ‌రులుగా మారిపోగా.. మ‌రికొంద‌రు దివాలా తీసి రోడ్డున ప‌డుతున్నారు. ఇక కేవలం సినిమా చేశామా.. డబ్బులు తీసుకున్నామా అని కాకుండా సినిమా ప్లాప్ అయితే ఆ నిర్మాతలను ఆదుకోవడం వంటివి చాల తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన నటించిన స్పైడర్ మూవీ తెలుగు, తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకొని మొదటివారానికి థియేటర్స్ నుండి బయటకు వెళ్ళింది.

దీంతో ఈ చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ భారీ గా నష్ట పోయాడు. దాదాపు రూ. 23 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తుంది. నష్టపోయిన నిర్మాతను ఆదుకోవడానికి మహేష్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న భరత్ అనే నేను సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కు ముందు కొంత నష్టాన్ని భర్తీ చేస్తానని మాట ఇచ్చారట. స్వయంగా మహేష్ మాట ఇవ్వడం తో నిర్మాత చాల సంతోష పడ్డాడని వినికిడి. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. అందరూ మహేష్ గొప్ప మనసు గురించి మాట్లాడుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat