తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలలోనే కాకుండా నిత్యం అధికారక కార్యక్రమాల్లో కూడా ఎంతో బిజీగా ఉంటారు .అయిన కానీ మరోవైపు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు .
నెటిజన్లు పెట్టె సమస్యల పట్ల స్పందిస్తారు .నెటిజన్లు చేసే ట్వీట్లకు కూడా రిప్లై ఇస్తారు .తాజాగా మంత్రి కేటీరామారావు మరోసారి నెటిజన్ల మనస్సును దోచుకున్నారు .నేడు మంత్రి కేటీరామారావు గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన చేయనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తమ అభిమాన నాయకుడు ..మంత్రి కేటీ రామారావు వరంగల్ వస్తోన్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,మంత్రి కేటీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు నగరం వ్యాప్తంగా ఏర్పాటు చేశారు .
దీనిపై ఒక నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ “సారు మీరు గతంలో హైదరాబాద్ మహానగరంతో పాటుగా రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలను ఫ్లెక్సీ రహిత కార్పోరేషన్ లుగా ప్రకటించారు .కానీ వరంగల్ మాత్రం మీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి ని కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ అక్కౌంట్ లో పోస్ట్ చేశారు .దీనికి స్పందించిన మంత్రి వెంటనే వరంగల్ మేయర్ ,సంబంధిత అధికారులకు అవి వెంటనే తీసేయ్యాలి అని ఆదేశాలను జారిచేశారు .మంత్రి స్పందించిన తీరుకు మరో సారి నెటిజన్లు తో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా మంత్రి కేటీఆర్ కు ఫిదా అయ్యారు .