తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు ఈ రోజు గ్రేటర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నగరంలోని హరితా హోటల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో తమ ప్రభుత్వం నిర్మించనున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీ తమ సర్కారు శ్రీకారం చుట్టింది.
దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న ఊళ్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాని వెల్లడించారు.ఫాం టూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ నెలకొల్పుతున్నామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకే చోట తయారీ జరుగుతుందని ..వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్దిక రాజధాని అవుతుందని ఆయన తెలిపారు.
దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్తర తెలంగాణ లో పండుతుందని పరిశోధనలో తేలింది. టెక్స్ టైల్ పార్కు తో పాటు పారిశ్రామిక ప్రాంతంతో వరంగల్ నగర విస్తరణకు అనుకూలంగా ఉందన్నారు. హైదరాబాద్ నుండి వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని ..మొత్తం రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు జరుగుతాయని, 1.20 లక్షల మందికి ఉపాది అవకాశాలు లభించనున్నాయని మంత్రి వెల్లడించారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నాట్లు ..
ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకోనున్నట్లు మంత్రి అన్నారు .