తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీరామారావు వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రముఖ నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమ్రపాలి, టాస్క్ చైర్మన్, ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మేయర్ నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో వరంగల్ నిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ యువతను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ యువత ప్రేరణ పొందే విధంగా తన ఉపన్యాసం కొనసాగించింది .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధీటుగా ఎదుర్కోవాలని యువతకు సూచించారు. సమస్యలను ధీటుగా ఎదుర్కోవడమే అసలైన సవాల్ అని ఈ సందర్భంగా తెలిపారు .
జీవితంలో రాణించాలంటే మానసికంగా, ధృఢంగా ఉండాలి. మానసికంగా, ధృఢంగా ఉంటే ఏదైనా సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. చదువుకునే సమయంలోనే అన్ని రక్షాల శిక్షణ పొందితేనే జీవితంలో రాణిస్తామని విద్యార్థులకు సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసే నాడు అన్నింటికీ సిద్ధపడాలని అన్నారు . ప్రతికూల పరిస్థితుల్లోనూ మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సమ్యలను ఎదుర్కోనేందుకు టాస్క్ లో నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. త్వరలోనే వరంగల్‌లో ఐటీ పార్క్, టెక్స్‌టైల్స్ పార్క్‌ను నెలకొల్పుతున్నామని తెలిపారు. త్వరలో మడికొండలో రూ. 25 కోట్లతో ఐటీ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.