తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భ్రష్టు పట్టిన దేవాలయాలను ..వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాలను ఆధునీకరిస్తున్న సంగతి తెల్సిందే .
దీనిపై ప్రముఖ ఆధ్యాత్మక వేత్త చినజీయ్యర్ స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు .నిన్న ఆయన భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని భద్రాది ఆలయాన్ని దర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు దేవుళ్ళను పట్టించుకోలేదు .కేవలం దేవుడి పేరిట వచ్చే సొమ్మును ,ఆస్తులను ఆశించే వారు మాత్రమే ఉండేవారు .కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నేడు రాష్ట్రంలోని పలు దైవక్షేత్రాలను అభివృద్ధి చేస్తూ ఆధునిక సాంకేతక రంగాన్ని వినియోగించి ఆధునిక పద్దతుల్లో తయారుచేస్తోన్నారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ దైవక్షేత్రాల్లో సరికొత్త ట్రెండ్‌ను ఆవిష్కరించి దేవుణ్ని కొలిచేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని ప్రముఖ ఆద్యాత్మిక వేత్త చినజియ్యర్ స్వామి అన్నారు.దేవాలయాల విషయంలో ముఖ్యమంత్రి కొత్త ట్రెండ్ సృష్టించారని ఆయన అన్నారు. దైవక్షేత్రాల్లో సేవను విస్తృతపరిచేలా ముఖ్యమంత్రి లోకహితం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైదిక వర్గానికి వసతులు కల్పించేందుకు, అర్చకులకు సముచిత గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మెచ్చుకోదగినవని చినజియ్యర్ అభిప్రాయపడ్డారు. యాదాద్రి తరహాలోనే భద్రాద్రి కొలువును అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు.