బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ రోషన్ పై కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా హృతిక్ ఈ విషయం పై స్పందించి.. తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. సైబర్ క్రైమ్ కి కూడా కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు నటుడు ఆదిత్య పంచోలి కూడా కంగనా పై పరువు నష్టం దావా వేశారు. కంగనా మాటలతో తన పరువును బజారుకీడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఆమె ప్రస్తావిస్తోందని మండిపడ్డారు. ఆమె కావాలని చేసిన ఆరోపణలను భరించవలసిన అవసరం తనకు లేదని చెబుతూ.. పంచోలి, ఆయన భార్య జరీనా వహబ్ లు కంగనపై పరువునష్టం దావా వేశారు. అలాగే కంగనా సిస్టర్ రంగోలిపై కూడా పరువునష్టం వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పంచోలి కంగనాను లైంగికంగా వేధించినట్లు రంగోలి సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసింది. కంగనా కెరీర్ మొదట్లో ఆదిత్య పంచోలి ఆమెతో క్లోజ్ గా ఉండేవారు కానీ ఆ తర్వాత విభేదాలతో ఇద్దరు దూరమయ్యారు.