కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేం. అంతకంటే ఎక్కువే ఉండాలి. దీని గురించి కమల్‌హాసన్‌కి బాగా తెలుసు, అన్నారు. రజనీ వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఓ మ్యాగజీన్‌లో రాసిన ఆర్టికల్ ద్వారాస్పందించారు. రాజకీయాల్లో గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని అన్నారు.
రాజకీయాల్లో అసలైన గెలుపుఅంటే ఏంటి.. ఓ కొత్త పార్టీ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకుని మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిపోవడమా.. గెలుపైతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా వారికి మంచి చేయడం కూడా గెలుపే, అని ఆయన అభిప్రాయపడ్డారు. ఐతే సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తరుచూ చేస్తూ ఉంటారు. ఐతే ఇద్దరిలోను కమ్యూనిస్టు భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. బహుశా దాని ప్రభావమో ఏమో.. కమల్ నవంబర్ నెలలో కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నారు. దీనికి ఇప్పటి నుండి ఆయన గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు.